కమలంలోకి కడియం.. కొండా సురేఖ
Timeline

కమలంలోకి కడియం.. కొండా సురేఖ

కాంగ్రెస్‌, టీడీపీకి చెందిన కీల‌క నేత‌ల‌ను వ‌రుస‌పెట్టి పార్టీలో చేర్చుకుంటోన్న బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న పెద్ద త‌ల‌కాయ‌ల‌ను కూడా టార్గెట్‌గా చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే టీఆర్ఎస్‌కు చెందిన ఓ కీల‌క నేత‌, కాంగ్రెస్‌కు చెందిన ఓ ఫైర్‌బ్రాండ్ లేడీపై క‌న్నేసిన క‌మ‌ల‌ద‌ళం వారిని పార్టీలో చేర్చుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇంత‌కు ఆ ఇద్ద‌రు పెద్ద త‌ల‌కాయ‌లు ఎవ‌రో కాదు. గ‌త టీ ఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో మాజీ డిప్యూటీ సీఎంగా కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన క‌డియం శ్రీహ‌రి, మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ, ఆమె భ‌ర్త మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళి అని టాక్‌. వీరితో కాషాయం పెద్ద‌లు ట‌చ్‌లో ఉన్నార‌ని.. స‌రైన టైం చూసుకుని వీరికి కాషాయ కండువా క‌ప్పే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.