చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్.. అమెరికా మొట్ట మొదటి మహిళా వైస్ ప్రెసిడెంట్
Timeline

చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్.. అమెరికా మొట్ట మొదటి మహిళా వైస్ ప్రెసిడెంట్

అమెరికా 46 వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నిక ఐన విషయాన్ని అధికారికంగా కొద్దీ క్షణాల క్రితం ప్రకటించారు. ఈ ఎన్నికలలో బైడెన్ కి తోడుగా నిలిచినా , వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గ పోటీ చేసిన కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించారు.అమెరికా చరిత్రలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యక్షురిలాగా ఆమె ఎన్నిక అవ్వటం ఒక రికార్డ్. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ చరిత్రను తిరగ రాశారు అని చెప్పొచ్చు. ఏ మహిళకూ సాధ్యం కాని రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు.

కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ స్వస్థలం తమిళ్ నాడు. వివాహానికి ముందే ఆమె అమెరికా వెళ్లి కాలిఫోర్నియాలోని ఓక్లాండోలో స్థిరపడ్డారు. జమైకాకు చెందిన డోనాల్డ్ హ్యారిస్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. 1964 అక్టోబర్ 20వ తేదీన కమలా హ్యారిస్ జన్మించారు. ఆమె న్యాయవాదిగా స్థిరపడ్డారు. 2003లో శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా విజయం సాధించారు. 2016లో నిర్వహించిన అమెరికా ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. మొట్టమొదటి ప్రయత్నంలోనే ఆమె సెనెట్‌కు ఎంపిక అయ్యారు. ఈ సారి ఏకంగా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.