ఆమె పాత్ర కోసం ఎంతకైనా సిద్దమే
Timeline

ఆమె పాత్ర కోసం ఎంతకైనా సిద్దమే

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక మార్కెట్ సంపాదించుకున్న నటీమణి కంగనా రనౌత్. స్టార్ హీరోల రేంఙ్ లో 100కోట్ల బిజినెస్ తో ముందుకు సాగుతున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు జయలలిత బయోపిక్ కోసం స్ట్రాంగ్ గా సిద్ధమవుతోంది. ఈ పాత్ర కోసం ఆమె భారీగా బరువు పెరుగుతుందంటూ పుకార్లు కూడా వచ్చేశాయి. కానీ జయలలిత పాత్ర కోసం మొద‌ట్లో ఆమె బ‌రువు పెర‌గ‌డం విష‌యంలో స‌సేమిరా అంది. ఒక్కసారి బరువు పెరిగితే తగ్గడం చాలా కష్టం.

రీసెంట్ గా సైజ్ జీరో సినిమా కోసం అనుష్క బరువు పెరిగింది. తర్వాత పెరిగిన వెయిట్ ను తగ్గించుకోవడానికి చాలా కష్టపడింది. బాలీవుడ్ లో కూడా ఇలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాని ప్ర‌స్తుతం ఆ విష‌యాల‌న్నీ ప‌క్క‌న పెట్టేసి పాత్ర కోసం బ‌రువు పెర‌గ‌డానికి రెడీ అయిపోయింది ఈ అమ్మ‌డు. ఈ సినిమాలో జ‌య‌ల‌లిత‌లా క‌నిపించేందుకు క‌స‌రత్తులు మొద‌లుపెట్టింది. ఇప్ప‌టికే త‌మిళం నేర్చుకుంటున్న కంగ‌నా.. బ‌రువు పెర‌గాల‌ని చాలా స్ట్రాంగ్ గా నిర్ణ‌యించు కోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ సినిమా కోసం దాదాపు పది కిలోలు వరకూ కంగనా బరువు పెరగుతున్నట్లు తెలుస్తోంది. అయితే జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుంది. మరి జయలలిత పాత్రను కంగనా రనౌత్ ఎలా మెప్పిస్తోందో చూడాలి. ఎంజీఆర్ పాత్ర‌లో అర‌వింద్ స్వామి, క‌రుణానిధిగా ప్ర‌కాష్‌రాజ్ న‌టించ‌నున్నారు.

ఇక విజయేంద్ర ప్రసాద్ కథ రాసే ముందే జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానాన్ని కూడా కథలో హైలెట్ చేస్తూ కథ రాశారట. ముఖ్యంగా ఒక హీరోయిన్ని ఒక రాష్ట్రం మొత్తం అమ్మగా భావించడానికి గల కారణాలు ఏమిటి అన్న పాయింట్ ని ప్రధానంగా తీసుకోని కొత్త కోణంలో ఈ కథ రాశారట. ఇక ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.

Leave a Reply

Your email address will not be published.