ADVERTISEMENT
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కుమారుడు ఫయాజ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అర్థరాత్రి విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి చేసిన ఆరోపణలపై ఆయనను అరెస్టు చేశారు. ఫయాజ్‌తో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో బెంగళూరులోని అమృతల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. ఫయాజ్‌పై ఐపీసీ సెక్షన్ 353 (ప్రభుత్వ ఉద్యోగిని తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకొని దాడి చేయడం) కింద అభియోగాలు మోపారు. కేసు దర్యాప్తులో ఉన్నది.
ADVERTISEMENT