లండన్‌లో పరిణతి చెందిన కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతుండడంతో అక్కడ క్రిస్మస్ వేడుకలను రద్దు చేసింది ఆ ప్రభుత్వం. అంతేకాకుండా జనవరి వరకు ఇంటర్నేషనల్ విమానాలను రద్దు కూడా చేసింది. ఇతర దేశాలు అమెరికా, చైనా, ఇండియా, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా లండన్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈలోపే లండన్ నుంచి వచ్చిన ప్రయాణికులను ఆయా దేశాలు క్వారంటైన్ లో ఉంచుతున్నాయి. భారతదేశంలో ఇప్పటి వరకే లండన్ నుంచి వచ్చిన వారి వల్ల కరోనా వ్యాప్తి చెందుతున్న భయంతో, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకల కారణంగా ఈ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని భావించిన కర్ణాటక ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. ఇలా దేశంలో ఢిల్లీ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. అయితే కారణం తెలియదు కానీ కర్ణాటక ప్రభుత్వం ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నాయి . రాత్రి కర్ఫ్యూను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నైట్ కర్ఫ్యూ అనవసరమని ప్రజల అభిప్రాయం నేపథ్యంలో ఈ ఉత్తర్వును ఉపసంహరించుకునే నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప అన్నారు. ప్రజలు COVID-19 సంబంధిత నియమాలు మరియు ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలని ఆయన కోరారు.
Karnataka withdraws order on night curfew