జగన్ కి కత్తి మహేష్ కౌంటర్

ప్రస్తుతం ఆంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. అలా ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలపై ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు. అది చాలదు అన్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన “నవరత్నాల” పేరిట మొదట ఒకమాట ఇప్పుడు వాటికి పూర్తి విరుద్ధంగా ఎక్కడలేని ఆంక్షలు పెడుతుండడంతో జనాలకు ఏమనాలో కూడా అర్ధం కాని పరిస్థితుల్లో ఉన్నారు.

అలా తాజాగా అమ్మఒడి పథకం విషయం లో జగన్ పెట్టిన ఆంక్షలు చూసి అదే జగన్ కు విపరీతంగా మద్దతు ఇచ్చిన కత్తి మహేష్ అనే ఒక వ్యక్తి తీవ్ర స్థాయి ఆరోపణలు చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.పవన్ కళ్యాణ్ ను మొదలుకొని మోడీ వరకు ఎవరినీ వదలకుండా సంచలనం రేపిన కత్తి మహేశ్ అకస్మాత్తుగా ఇలా ప్లేట్ ఫిరాయించడం వెనుక కూడా ఒక సీక్రెట్ ఉందని తెలుస్తోంది. నిజానికి సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమందిని జగన్ పెంచి పోషిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

అలాంటి వారిలో కత్తి మహేష్ ముఖ్యుడు.అలాంటిది అతనే ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టడం వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. తాను ఎప్పుడూ తటస్థున్ని అని ప్రాజెక్ట్ చేస్తున్నా అనుకుంటూనే అనధికారికంగా జగన్ కు కొమ్ము కాసేవాడు కత్తి మహేష్ ఇది అనేకసార్లు బట్టబయలు అయ్యింది కూడా.అలాంటి కత్తి నిజంగానే తటస్థంగా ఉన్నాడు అని జనాన్ని నమ్మించడానికే ఈ ప్రయత్నం.ఇలా అవసరం ఉన్నప్పుడు జగన్ ఏజెంట్ లా పనిచేస్తాడు. లేనప్పుడు కూడా తానేదో మేధావిలాగా తటిస్తునిగా ఉన్నట్లు బిల్డప్ ఇస్తూ ఏపీ ప్రజలను వెర్రి వాళ్ళనూ చేస్తాడు..ఇది కత్తి ఇంత సడెన్ జగన్ కు ఎదురు తిరగడం వెనుక ఉన్న అసలు కథ.

కొత్త వార్తలు