31 వరకు తెలంగాణ బంద్.. 2500 కోట్లు ప్రకటించిన కెసిఆర్

రోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని హెచ్చరించారు. ప్రజలు గుమిగూడొద్దనేదే దీని వెనుక ప్రధాన ఉద్దేశమని వివరించారు. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు ప్రకటించారు.


రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులపై ప్రగతి భవన్‌లో ఆదివారం (మార్చి 22) సాయంత్రం మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణను లాక్‌డౌన్ చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఆదివారం మరో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సీఎం తెలిపారు. వీరు కూడా విదేశాల నుంచి వచ్చిన వారేనని వెల్లడించారు. ఇద్దరు లండన్, ఇద్దరు దుబాయ్, మరొకరు స్కాట్లాండ్ నుంచి వచ్చారని చెప్పారు. దీంతో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 26కు పెరిగినట్లు తెలిపారు. అయితే.. బాధితులెవరికీ ప్రమాదమేమీ లేదని వివరించారు.

రాష్ట్రాన్ని సంపూర్ణ నిర్బంధంలో పెట్టిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. పేదలకు 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.1500 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డులందరికీ లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 87.59 లక్షల మందికి అందజేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు కింద ఇస్తున్న బియ్యాన్ని డబుల్ చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ.2417 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

కూలీలకు వారం రోజుల వేతనాలు


ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు రావాల్సిన పని లేదని కేసీఆర్ తెలిపారు. అత్యవసర సేవలకు సంబంధించిన వారు మాత్రం పనిచేస్తారని చెప్పారు. మిగిలిన శాఖలకు సంబంధించిన వారు 20 శాతం మాత్రమే హాజరవుతారని తెలిపారు.

Read Previous

కరోనా పై పవన్ కళ్యాణ్ ఫేక్ ఇన్ఫర్మేషన్.. డిలీట్ చేసిన ట్విట్టర్

Read Next

31 వరకు ఏపీ బంద్.. మొత్తం వివరాలు