యాదాద్రిలో ఉద్రిక్తత: కేసీఆర్ ఫోటోలు తొలగించేదాకా ఆందోళనలు చేస్తాం

తెలంగాణ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శనివారం సాయంత్రం ఉద్రిక్తత తలెత్తింది. తెలంగాణ బీజేపీ శ్రేణులు ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో యాదాద్రి కొండపైకి ర్యాలీగా బయలుదేరగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.కొండ పైకి కొందరినే అనుమతిస్తామని.. అందరినీ అనుమతించేది లేదని చెప్పారు.

అయితే అందరినీ అనుమతించాల్సిందేనని లక్ష్మణ్ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి బలవంతంగా అక్కడినుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్వల్ప లాఠీచార్జి కూడా జరిగినట్టు తెలుస్తోంది. యాదాద్రి అష్టభుజి ప్రాకారాలపై కేసీఆర్ ఫోటోలు తొలగించేదాకా తమ ఆందోళనలు కొనసాగుతాయని లక్ష్మణ్ అన్నారు.