మహారాష్ట్ర సరిహద్దు బంద్: కేసీఆర్

తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిస్తే… సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేసి 24 గంటల పాటు (22వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు) జనతా కర్ఫ్యూ పాటించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ అధికంగా ఉన్నందున త్వరలో మహా రాష్ట్ర సరిహద్దు బంద్ ప్రకటిస్తామని.. చెక్ పోస్ట్లులు కూడా సిద్ధంచేస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనాపై ప్రజలు అప్రమత్తమై ఎప్పటికప్పుడు జాగ్రత్తలను పాటించాలని సూచించారు.

Read Previous

మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Read Next

విదేశాల నుంచి వచ్చే వారికి దండం పెట్టి చెబుతున్నా:కేసీఆర్