జీహెచ్ఎంసీ ఎన్నికలపై తెలంగాణలోని అన్ని రాజాకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే బలవంతులను రంగంలోకి దించి గెలుపు దిశగా వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ ఇప్పటికే ఆరేళ్లలో తాము ఎలాంటి అభివృద్ధి చేశామన్న విషయాన్ని చెపుతూ ప్రచారం మొదలుపెడితే, కాంగ్రెస్ తెరాస చేసిన అవినీతి పై ఫోకస్ పెట్టింది. ఇక బీజేపీ హిందువులకు జరుగుతున్న అన్యాయం , దుబ్బాక గెలుపు అంటూ మరో అజెండాను భుజాన వేసుకొని యువతను టార్గెట్ చేస్తూ చాలన్లు రద్దు చేస్తాం అంటూ కొత్త కొత్త ప్రామిస్ లు చేస్తుంది.

టీఆర్ఎస్ హైదరాబాద్‌లో భారీ సభను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసింది. దీనికి తేదీ కూడా ఖరారు చేసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే మరో రెండు రోజుల్లో ఆ సభను నిర్వహించనున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే మనకు ఉన్న సమాచారం ప్రకారం 28 వ తేదీన కెసిఆర్ పబ్లిక్ మీటింగ్ ఖరారు చేసినట్టు సమాచారం.

ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేస్తుంది ఆ పార్టీ.