ఆర్టీసీ సమ్మె: కెసిఆర్ ని చేరిన హైకోర్టు ఆర్డర్

547

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాల కాపీ మంగళవారం ప్రభుత్వానికి చేరింది. దీంతో కార్యాచరణ చర్చించేందుకు మంత్రి పువ్వాడ అజయ్, అధికారులు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. హైకోర్టు కాపీని పరిశీలించిన తర్వాత సీఎం కేసీఆర్ ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చలు జరుపుతారు. తదుపరి చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. 

హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన విషయం అధికారులు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. దీనిపై స్పందించిన ఆయన హైకోర్టు ఇచ్చిన కాపీపై అధ్యయనం చేసి, కోర్టు ఏమిచ్చింది.. సాధ్యసాధ్యాలపై మొత్తం అధికారులతో చర్చించి నివేదిక తయారు చేయాలని మాజీ సీఎస్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మకు ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మంత్రి పువ్వాడ, ముఖ్య అధికారులతో రాజీవ్ శర్మ ప్రగతి భవన్‌లో సమీక్షిస్తున్నారు. ఈ సాయంత్రం 3 గంటలకు కేసీఆర్ కోర్టు తీర్పు, ఇతర అన్ని అంశాలపై చర్చించి.. ఆర్టీసీకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.