బిగ్ బ్రేకింగ్ : ఆర్టీసీ దుకాణం బంద్, తేల్చి చెప్పేసిన కేసీఆర్

313

ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను ఇకపై విధుల్లోకి తీసుకునే ప్రసక్తేలేదని ప్రకటించారు. కార్మికులతో ఇకపై చర్చలు జరిపేది లేదని సీఎం తేల్చి చెప్పారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆదివారం రవాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం చేపట్టిన కేసీఆర్‌ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తేలేదని ప్రకటించారు. ఆర్టీసీ మనుగడ సాగలాంటి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్న కేసీఆర్‌.

ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లోకి రాని కార్మికులను గుర్తించమని తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీలో కేవలం 1200 మంది కార్మికులే ఉన్నారని కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఇకపై ఆర్టీసీలో బ్లాక్‌ మెయిల్‌విధానం ఉండకూడదని సీఎం అభిప్రాయపడ్డారు

Image
Image
Image