యాసంగి పెట్టుబడి సాయం పంపిణీని ఈ నెల 27 నుంచి ప్రారంభించి పదిరోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు.. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.7,300 కోట్లను తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్‌ రైతుబంధు పెట్టుబడి సాయంగా పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ యాసంగిలో దాదాపు 59.32 లక్షల మంది రైతులకు ఈ పెట్టుబడి సాయాన్ని అందజేయనుంది కెసిఆర్ ప్రభుత్వం. గత సంవత్సరం 57.62 లక్షల మంది పట్టాదారులకు రైతుబంధు సాయాన్ని పంపిణీ చేస్తే ఈ సీజన్‌లో 1.70 లక్షల మందికి అదనంగా లబ్ది చేకూరనుంది. కొత్తగా పాస్‌ పుస్తకాలు పొందిన రైతులు ఈసారి రైతుబంధు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు. 27వతేదీ ఆదివారం కావడంతో రైతుబంధు నగదు బదిలీని 28 నుంచి ప్రారంభించనున్నారు. బ్యాంకుల నుంచి రైతులు నగదు డ్రా చేసే సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published.