spot_imgspot_img

ఎక్స్ క్లూజివ్: రైతులకు కెసిఆర్ ప్రకటించబోయేవి ఇవే

తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా పరిధిలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను, మర్కూక్ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్ రామానుజ స్వామి తో కలిసి ప్రారంభించారు. అనంతరం కాల్వలు, రిజర్వాయర్లు, లిఫ్టు పథకాలు, చెక్ డ్యాముల నిర్మాణాల మరమ్మతులపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

కొండపోచమ్మ రిజర్వాయర్ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు యావత్ తెలంగాణ సాగునీటి ముఖ చిత్రాన్ని, వ్యవసాయ రంగ సమగ్ర చిత్రాన్ని మార్చేసిందని చెప్పుకొచ్చారు. మల్టీ లెవెల్ లిఫ్టింగ్ స్కీములను వేగంగా పూర్తి చేయడమనేది అంత ఈజీ టాస్క్ కాదని అతి తక్కువ కాలంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇంజనీర్లకు, నిర్మాణ సంస్థలకు పేరు పేరునా అభినందనలు తెలిపారు కెసిఆర్.

మరో వారం రోజుల్లో ఎవరూ ఊహించని గుడ్ న్యూస్‌ను తెలంగాణ రైతులకు వినబోతున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కెసిఆర్. యావత్ తెలంగాణ రైతాంగం ఆనందంలో మునిగి తేలేలా తాను ప్రకటించే శుభవార్త ఉండబోతుందని కేసీఆర్ తెలిపారు.

అయితే ఇప్పుడు కెసిఆర్ చెప్పబోయే ఆ శుభవార్త ఏంటా అని రైతాంగంలోనే కాకుండా సామాన్య జనాలు, ప్రతి పక్షాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే తెలుగు సర్కిల్స్ కి విశ్వసనీయ రాజకీయ అందుతున్న సమాచారం ప్రకారం కెసిఆర్ ప్రకటించబోయే అంశాలు ఇవ్వని తెలుస్తున్నాయి .

1) నియంత్రిత వ్యవసాయంలో రైతులకు ప్రోత్సాహకాలు
2) రైతులు పండించే పంటకు భారీగా మద్దతు ధర భారీగా పెంచడం
3) రైతులు పండించిన పాటను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం
4) రైతులకు ఎరువులు, విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయడం
5) తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా పంటల భీమా పథకం తేవొచ్చు

Related Articles

Get in Touch

18,128FansLike
3,038FollowersFollow
0SubscribersSubscribe

Latest Posts