తెలుగులో ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన “నేను శైలజ” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన తమిళ బ్యూటీ కీర్తి సురేష్.ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తెలుగు సినీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.
అందం, అభినయంతో వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంది.
ముఖ్యంగా యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి చిత్రంలో అలనాటి అందాల తార సావిత్రి పాత్రలో నటించి తన నటన ప్రతిభని, అభినయాన్ని నిరూపించుకుంది.
ఇటీవలే కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి నిరాశపరుచగా, కీర్తి తనకు తాగని అందంతో, వెయిట్ లాస్ తో కనిపించి ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది.
ప్రస్తుతం తెలుగులో కీర్తి సురేష్ ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘రంగ్ దే’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
కీర్తి సురేష్, మహేష్ మూవీ ‘సర్కారు వారి పాట’ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే.. మరో వారం రోజుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగనుంది.
‘సర్కారు వారి పాట’ సినిమాలో తన పాత్రకు అనుగుణంగా కీర్తి సురేష్ కాస్త బరువు పెరగనుందని తెలుస్తుంది.