బర్త్ డే సందర్బంగా కీర్తి లుక్ రిలీజ్

13

‘హైదరాబాద్‌ బ్లూస్, ఇక్బాల్‌’ వంటి సినిమాలను తెరకెక్కించిన హైదరాబాదీ దర్శకుడు నగేష్‌ కుకునూర్‌ స్పోర్ట్స్‌ రామెడీ (రొమాంటిక్‌ కామెడీ) జానర్‌లో తెలుగులో తొలిసారి ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆది పినిశెట్టి, కీర్తీ సురేశ్, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర నిర్మిస్తున్నారు. ఇవాళ కీర్తీ సురేశ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో కీర్తీ లుక్‌ను రిలీజ్‌ చేశారు.