మోహన్‌లాల్‌కు హైకోర్టు నోటీసు

16

చట్ట నిబంధనలకు విరుద్ధంగా నాలుగు ఏనుగుదంతాలను కలిగి వున్నాడన్న కేసులో ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌కు కేరళ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. చట్ట విరుద్ధంగా ఏనుగుదంతాలను కలిగి వున్నందున ప్రభుత్వం ఈ నటుడికి జారీ చేసిన ప్రభుత్వ సర్టిఫికెట్‌ను రద్దుచేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యా(పిల్‌)న్ని విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ఈ నోటీసులు జారీ చేసింది.

కొచ్చి ప్రాంతంలోని ఉదగమండలానికి చెందిన ఎఎ పాల్‌ అనే వ్యక్తి ఈ పిల్‌ను దాఖలు చేశారు. 2012 జూన్‌లో కొచ్చి లోని మోహన్‌లాల్‌ ఇంటిపై దాడిచేసిన ఆదాయపు పన్ను అధికారులు ఆయన అక్రమంగా నాలుగు ఏనుగు దంతాలను కలిగి వున్నట్లు కనుగొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏనుగుదంతాలను కలిగి వున్నారన్న అభియోగంతో కేరళ అటవీశాఖ ఆయనపై క్రిమినల్‌ కేసును నమోదు చేసింది.