Breaking News :

తెలంగాణలో హత్యాచారాలు తక్కువ

వెటర్నరీ డాక్టర్ హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం తగదని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. దిశ ఘటనలో ప్రభుత్వం సరిగా స్పందించలేదనే విమర్శలను కేకే ఖండించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే దిశ ఘటనకు కారణం అన్న ఆరోపణలను కొట్టిపారేశారు. దిశ వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం వెంటనే స్పందించిందని కేకే చెప్పారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని, వారిని విధుల నుంచి తొలగించిందన్నారు. దేశంలోనే తెలంగాణలో హత్యాచారాలు తక్కువని అని కేకే తెలిపారు.

Read Previous

కస్టమర్లకు జియో భారీ షాక్

Read Next

నీ ఫ్యాన్స్ ని కంట్రోల్ లో పెట్టడం నేర్చుకో