కెజిఎఫ్ డైరెక్టర్ తో మహేష్ మూవీ ఫిక్స్
Timeline

కెజిఎఫ్ డైరెక్టర్ తో మహేష్ మూవీ ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

కెజిఎఫ్ తో దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ తో మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నాడని ఆమధ్య వార్తలు వచ్చాయి. ప్రశాంత్ వచ్చి నమ్రత, మహేష్ లకు ఓ కథ చెప్పితే అది ఇద్దరికీ భలే నచ్చదని కూడా అప్పట్లో గుసగుసలు వినిపించాయి.

తాజా వార్త ఏమిటంటే… ప్రశాంత్ నీల్ నిన్న మధ్యాహ్నం మహేష్ బాబును తన నివాసంలో కలిశారు. సూపర్ స్టార్ కి ఒక గంటపాటుగా స్క్రిప్ట్ వివరించాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఆ కథ విని మహేష్ చాలా ఎక్సయిట్ అయ్యారట. పూర్తి కథతో వచ్చాక మూవీ ఫైనల్ చేస్తారని టాక్ వినిపిస్తుంది.

వచ్చే ఏడాది మహేష్ బాబు సంచలనాత్మక దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌలితో కలిసి పని చేయడానికి ముందే ఈ ప్రాజెక్ట్ రోల్ పూర్తి చెయ్యాలని భావిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ ను మహేష్ బాబు తన సొంత బ్యానర్ GMB ఎంటర్టైన్మెంట్ తో తీసుకురావాలని భావిస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published.