ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్ తన నియోజక వర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరోనా కదా సేఫ్టీ కోసం నిర్వాహకులు శానిటైజర్ ఏర్పాటు చేశారు. అక్కడ ఈవెంట్ లో పాల్గొన్న వారి చేతులకు శానిటైజర్ కొడుతున్న క్రమంలో అప్పుడే ఎమ్మెల్యే రేఖా నాయక్ చేరుకుంది. శానిటైజర్ స్ప్రే బాటిల్ పట్టు తప్పి పక్కనే ఉన్న ఆమె కళ్లల్లో ఆ లిక్విడ్ పడింది. దానితో ఒక్కసారిగా ఆమె తీవ్రమైన కళ్ల మంటలు రావడంతో వెంటనే చికిత్స కోసం ఖానాపూర్ ఆసుపత్రికి తరలించారు.
అందుకే శానిటైజర్ తో జర జాగ్రత్త. కంటికి దూరంగా వాడండి. అతిగా వాడినా ప్రమాదమే. గుర్తుంచుకోండి