కియారా అద్వానీ న్యూ డ్రెస్: మాగీ మీద బోర్ కొట్టి ఇలా డ్రెస్ తయారు చేశారా!
Timeline

కియారా అద్వానీ న్యూ డ్రెస్: మాగీ మీద బోర్ కొట్టి ఇలా డ్రెస్ తయారు చేశారా!

ఇటీవల విడుదలైన షాహిద్ కపూర్, కియారా అద్వానీ సినిమా “కబీర్ సింగ్” బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ‘గుడ్ న్యూస్’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌, కరీనా కపూర్ ఖాన్, దిల్జిత్ దోసంజ్‌లతో కలిసి నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

నటి కియారా అద్వానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన పిక్ హాట్ టాపిక్ అయింది. బ్రైట్ ఎల్లో డ్రెస్ ధరించిన కియారా పిక్ మీద రకరకాల ట్రోల్స్ దర్శనమిస్తున్నాయి. ఈ ట్రోల్స్ రావడానికి కారణం ఆమె ధరించిన డ్రెస్ వెరైటీగా ఉండటమే. ఈ డిజైనర్ డ్రెస్‌ను చాలా మంది మాగీ నూడుల్స్‌తో పోల్చడం గమనార్హం.

అభిమానులు కియారా డ్రెస్సుపై ఇలా రియాక్ట్ అవుతున్నారు..

“మసాలా మాగ్గి”

“మీరు మాగీని ఎక్కువగా ప్రేమిస్తున్నారా ”

“మాగీ ఇంతకు ముందెప్పుడు ఇంత బాగా కనిపించలేదు”

“మీకు మాగీ మీద బోర్ కొట్టి ఇలా డ్రెస్ తయారు చేశారు. ఫుడ్ వేస్ట్ కాకుండా ఇదే ఉత్తమ మార్గం”

Leave a Reply

Your email address will not be published.