కిషన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి @ కోటి దీపోత్సవం

18

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ నిర్వహిస్తోన్న కోటిదీపోత్సవం కన్నులపండువగా సాగుతోంది. ఇలకైలాసంలో జరుగుతోన్న ఈ ఉత్సవాన్నికి ప్రముఖులు తరలివస్తున్నారు.. పదకొండవ రోజు కోటిదీపోత్సవానికి తెలంగాణ నుండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, టిటిడి చైర్మన్ వైవి .సుబ్బారెడ్డి, హైదరబాద్ సిటి పోలీసు కమీషనర్ అంజనీకుమార్, భజరంగదళ్ అధ్యక్షులు సోహన్ లాల్ సోలంకి తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. పదకొండవ రోజు కోటిదీపోత్సవం శ్రీ  హనుమత్ శాస్త్రీ వేద పాఠశాల ,మంచిర్యాల  విద్యార్ధుల వేద పఠనంతో ప్రారంభంకాగా ఆ తర్వాత ప్రాంగణంలోని మహశివ లింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు.


జివి.ప్రభాకర్  బృందంచే భక్తి గీతాలు ఆలాపన, రమణమూర్తి బృందంచే సర్వవాద్య సమ్మేళనం, బ్రహ్మశ్రీ శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ప్రవచనం , వేదికపై శ్రీ శ్వేతార్కమూల గణపతికి కోటిగరికార్చన, చౌకిలపై భక్తులచే గణపతి విగ్రహాలకు కోటి గరికార్చన, కాణిపాకం శ్రీవరసిద్ది వినాయక స్వామి కల్యాణోత్సవం, మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఇక పదకొండవ రోజు ఉత్సవాలకు రామచంద్రమిషన్ అంతర్జాతీయ అధ్యక్షులు కమలేశ్ డి.పటేల్‌జీ, జగన్నాథ మఠం పీఠాధిపతి శ్రీ వ్రతథరరామానుజ జీయర్ స్వామి, శ్రీ శైవ క్షేత్రం పీఠాధిపతి శ్రీ శివ స్వామి తదితర ప్రముఖులు హాజరయ్యారు.