కరోనా విషయంలో ఆ బాధ్యత ప్రభుత్వానిదే: కిషన్ రెడ్డి

హైద‌రాబాద్‌: గచ్చిబౌలి టిమ్స్, ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి, గాంధీ హాస్పిటల్స్ ని సందర్శించి, అందుతోన్న వైద్యం, వసతులను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అత్యంత వేగంగా కరోనా విస్తరిస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది.. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేయాలి.. కరోనాను కట్టడి చేస్తోన్న ఢిల్లీని తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలి అని కిషన్ రెడ్డి తెలిపారు

కరోనా బారినపడినవారు ప్రభుత్వ ఆసుపత్రిల్లో చికిత్స తీసుకోవాలి.. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావొద్దు.. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పారు

కరోన పేషెంట్స్ బయట తిరుగుతున్నారు.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. బయట తిరుగుతోన్న హోమ్ ఐసోలేషన్ పేషెంట్స్ ను ప్రభుత్వం గుర్తించాలి.. ఆగస్టు నెలలో ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలి ఆయన విజ్ఞప్తి చేశారు