అంబర్‌పేట్ క్రాస్‌రోడ్స్‌లో నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబదించిన పనులు త్వరగా అయ్యేలా చూడమని కేంద్ర హోంమంత్రి జి. కిషన్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు.
దాని కోసం అవసరమైన భూమిని స్వాధీనం చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా అంబర్‌పేట్ క్రాస్‌రోడ్స్‌లోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.
ADVERTISEMENT
కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ 2018 మే 5 న పునాదిరాయి వేశారని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 76.33 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని ఆయన అన్నారు. ఇప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఫ్లైఓవర్ కోసం భూమిని స్వాధీనం చేసుకుని సంబంధిత కాంట్రాక్టర్‌కు అప్పగించాలి అని ఆ లేఖలో కిషన్ రెడ్డి తెలిపారు
ADVERTISEMENT