Breaking News :

ఢిల్లీ మెట్రో రైల్లో రొమాన్స్

మెట్రో రైలులో ప్రేమ జంటలు రెచ్చిపోతున్నాయి. అందరూ చూస్తున్నారనే సంగతి మరిచిపోతున్నారు. కౌగిలింతలు, ముద్దులతో పరవశించి పోతున్నారు. సీసీ కెమెరాలు ఉంటాయని తెలిసినా..వీరు పబ్లిక్‌గా రెచ్చిపోతుండడంతో తోటి ప్రయాణీకులు షాక్ తింటున్నారు. కొంతమంది వీటిని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఢిల్లీ మెట్రో రైల్లో ఓ జంట కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటూ మైమరించింది. మెట్రోలో ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. కానీ కుర్రకారికి మెట్రో హాట్ స్పాట్‌గా మారిపోతున్నాయి. కాసింత ఏకాంతం దొరుకుతుందా..అని ఎదురు చూసే లవర్స్..తమ అవసరానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ మాత్రం కూడా పట్టించుకోకుండా వారు మైమరిచిపోయాాంటే.. కామాతురానాం నభయం నలజ్జ.. నజనం అన్నట్టే ఉంది పరిస్థితి. వీరి చేష్టల వల్ల తోటి ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

Read Previous

తెలంగాణ పోలీసులకు మద్దతుగా సోషల్ మీడియా

Read Next

బీజేపీ – జనసేన దోస్తీ: మరో సంకేతం ఇచ్చిన పవన్!