ప్రజలే పవన్ కళ్యాణ్ ఒక బోడిలింగం అని డిసైడ్ చేసారు…
Timeline

ప్రజలే పవన్ కళ్యాణ్ ఒక బోడిలింగం అని డిసైడ్ చేసారు…

జనసేన పార్టి అధినేత పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానినే టార్గెట్ చేశారు. ఏకంగా కొడాలి నాని సొంత నియోజకవర్గం కృష్ణా జిల్లా గుడివాడ జంక్షన్‌లో నిలబడి మంత్రి కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గుడివాడలో పేకాట క్లబ్బులు నడుపుతున్నారంటూ నానిపై పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఆయన కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌ ఓ బోడిలింగమని, షకీలా సాబ్‌ అని ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత లేదన్నారు. ప్యాకేజీ స్టార్‌ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. కోడలి నాని పేకాట క్లబ్బులు మూయించాడు , నడిపించలేదు అనే విషయాన్ని బాబు దత్త పుత్రుడు తెలుసుకోవాలి. హ్యాపీగా సినిమాలు చేసుకో, నాలుగు డబ్బులు సంపాదించుక. అంతే కానీ నీ ప్యాకేజీ కోసం మా సమయం వృధా చేయకు. ప్రజలకు ఎవరు బోడిలింగమో తెలుసు అందుకే నిన్ను రెండు చోట్ల ఓడగొట్టారు. ఇప్పటికైనా బుద్ద తెచ్చుకో అని సలహా ఇచ్చారు నాని. బోడి లింగం ఎవరో, శివలింగం ఎవరో… గాజువాక, భీమవరం ప్రజలను అడిగితే చెప్తారన్నారు.

తాను ఎవరికీ భయపడబోనన్న జనసేనాని వ్యాఖ్యలకు మంత్రి నాని ధీటుగా జవాబు ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌కు కూడా ఎవరు భయపడబోరని స్పష్టం చేశారు. పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని.. నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన పవన్‌ను హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published.