షాకింగ్: బీజేపీ గుట్టు రట్టు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు
Timeline

షాకింగ్: బీజేపీ గుట్టు రట్టు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు

భాగ్యనగరంలో భారీ స్థాయిలో కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలిసిందని బీజేపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఎన్నో కుట్రలు చేసిందని కేటీఆర్ చెప్పారు. మొదట డబ్బుల ప్రయోగం చేసి ఫెయిల్ అయ్యారని, ఈ రోజు కూడా కోటి రూపాయలు దొరికాయని కేటీఆర్ తెలిపారు. అభ్యర్థికి చేయి విరిగినట్లు, బీజేపీ అధ్యక్షుడిని కొట్టినట్లు చిల్లర డ్రామా చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్త ఆత్మహత్యాయత్నంతో ఈ రోజు చివరి కుట్రకు తెరలేపారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి నిరసనగా రేపు ప్రగతి భవన్ గాని, డీజీపీ కార్యాలయం గానీ, టీఆర్ఎస్ కార్యాలయ ముట్టడి గాని చేయాలనుకుంటున్నారని.. లాఠీచార్జీ, ఫైరింగ్ జరిగే స్థాయిలో ఆందోళన చేసే కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసిందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. కుట్రలకు పాల్పడి దుబ్బాకలో రెండు ఓట్లు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ తీరుపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేస్తామని, అలాగే డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ తెలిపారు. 

Image