TRS : ఢిల్లీలో ప్రగతి భవన్ నిర్మాణం.. అతి త్వరలో
Timeline

TRS : ఢిల్లీలో ప్రగతి భవన్ నిర్మాణం.. అతి త్వరలో

ఢిల్లీలో కూడా టీఆర్ఎస్ భవన్‌ను నిర్మించాలన్న పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం నేపథ్యంలో కీలక ముందడుగు పడింది. ఢిల్లీ వసంత్ విహార్‌లో టీఆర్ఎస్‌కు 1,100 చదరపు మీటర్ల భూమిని కేంద్రం అప్పగించింది. ఈ భూమికి సంబంధించిన పత్రాలను టీఆర్ఎస్ తరపున మంత్రి వేముల ప్రశాంత్ అందుకున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ తరహాలో ఢిల్లీలోనూ పార్టీ ఆఫీసు నిర్మించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు టీఆర్ఎస్ నేతలు చెప్పారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఢిల్లీలో టీఆర్ఎస్‌కు పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి వెయ్యి గజాల స్థలం కేటాయించే అవకాశముంది. అందుకే స్థలాల పరిశీలనలో ఉన్నారు. సంక్రాంతి పండగ తర్వాత ఢిల్లీలో కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారట. అలాగే రెండు మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట.