వామ్మో వామ్మో … మళ్ళీ రేట్లు పెరుగుతాయట
Timeline

వామ్మో వామ్మో … మళ్ళీ రేట్లు పెరుగుతాయట

టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, ఎయిర్‌ కండీషనర్లు (ఏసీ), మైక్రోవేవ్‌ ఓవెన్‌లు మరింత ప్రియం కానున్నాయి. ఈ నెల చివర్లో లేదా వచ్చే నెలలో వీటి ధరలు మరో 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే ముడి సరుకుల ధరలు, సరుకు రవాణా వ్యయాలు గడిచిన కొద్ది నెలల్లో అనూహ్యంగా పెరగడమే ఇందుకు కారణం. కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సీఈఏఎంఏ) అధ్యక్షుడు కమల్‌ నంది ఈ విషయాన్ని వెల్లడించారు. భారీగా పెరిగిన ఉత్పత్తి వ్యయ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం తప్ప కంపెనీలకు ప్రత్యామ్నాయం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published.