తెలంగాణలో ఆర్టీసీ సమ్మె… సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంకృతమేనని రాష్ట్ర హైకోర్టు తేల్చి పారేసింది. ప్రభుత్వ నిష్క్రియాపరత్వం కారణంగానే కార్మికులు సమ్మెకు వెళ్లారని అయినా సమ్మెకు వెళ్లేలా కార్మికులను ముందుకు తోసింది ప్రభుత్వ నిర్ణయాలేనన్న కోణంలో హైకోర్టు చేసిన కామెంట్లు కేసీఆర్ కు నిజంగానే పెద్ద దెబ్బగానే పరిగణించక తప్పదు. ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు… కేసీఆర్ సర్కారు తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె నోటీసు ఇస్తే…...
ఎల్బీనగర్‌-మియాపూర్‌ మెట్రోలో శుక్రవారం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. డోర్‌పైనున్న క్యాబిన్‌ ఊడి ప్రయాణికులపై పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానప్పటికీ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు చేరుకున్నసమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఇదిలాఉండగా.. గత 14 రోజులుగా టీఎస్‌ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండటంతో హైదరాబాద్‌ మెట్రో సర్వీసులకు జనం తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు పట్టుకుని నిల్చునే డోర్‌పైనున్న క్యాబిన్‌ ఊడిపోయినట్టు పలువురు చెప్తున్నారు.
కల్కి భగవాన్‌ ఆశ్రమాల్లో మూడో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాలు సహా చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో ఈ ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. రెండ్రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో రూ.33కోట్ల విలువైన నగదు పట్టుబడిందని, ఇందులో రూ.24కోట్ల భారత కరెన్సీ, రూ.9కోట్ల విదేశీ కరెన్సీ ఉందని సమాచారం. ఇక ఏపీ, తమిళనాడు సహా ఆఫ్రికా దేశాల్లో భారీగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారని అంటున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని ఆశ్రమం చుట్టూ భారీగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది.
తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లోని ఓ మసీదులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన పేలుడులో 65 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 36 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హస్కామినా ప్రాంతంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, పేలుడు సంభవించిన నంగర్‌హర్ ప్రావిన్స్‌లో తాలిబన్, ఐసిస్ ప్రాబల్యం బలంగా ఉన్నప్పటికీ ఈ పేలుడుకు ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత వహించలేదు.
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును నవంబరు 1కి వాయిదా వేసింది. సీబీఐ ఊహాజనిత ఆరోపణలతో కౌంటర్ దాఖలు చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కౌంటర్​లో సీబీఐ వాడిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నాననీ.. తాను హాజరు కాకుంటే విచారణలో జాప్యం ఎలా జరుగుతుందో...
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రేపు అన్ని రాజకీయ, ప్రజా సంఘాలు ఐక్యంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రజారవాణా వ్యవస్థను ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు రాష్ట్ర బంద్‌కు దిగాయి. ఈ బంద్‌ పిలుపునకు ఆటోలు, క్యాబ్‌లు, ఇతర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించి రేపటి బంద్‌లో పాల్గొంటున్నట్టు తెలిపాయి. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేపట్టి నేటికి రెండు వారాలు పూర్తయింది. ఆందోళనలు,...
ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్‌లో భారీ స్కాం జ‌రిగిన‌ట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప‌దిహేను ఏళ్లుగా కొంద‌రి చేతుల్లోనే ప్ర‌కాశం జిల్లా క్రికెట్ ఆసోసియేష‌న్ న‌లిగిపోతోంది. అధ్య‌క్షుడు, కార్య‌ద‌ర్శి క‌నుస‌న్న‌ల్లో కోట్లాది రూపాయ‌లు నిధుల గోల్ మాల్ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. విజిలెన్స్ విచార‌ణ జ‌రిపించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌కు త‌ల్లిదండ్రులు, ప్లేయ‌ర్లు ఫిర్యాదు చేశారు. ప్లేయ‌ర్స్ ను ఎంపిక కోసం పేరెంట్స్ నుంచి భారీగా డ‌బ్బులు వ‌సూళ్లు చేసిన‌ట్లు స‌మాచారం. లంచాలు తీసుకుని స్థానికేత‌రుల‌కు కూడా ఇందులో...
యూత్ లో మంచి క్రేజ్ ఉండే హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ఇప్పటివరకూ స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం రాకపోయినా మొదటిసారి ఏకంగా మహేష్ బాబు క్రేజీ ప్రాజెక్టు 'సరిలేరు నీకెవ్వరు' లో అవకాశం సాధించింది. మహేష్ తో నటించడం అంటే హీరోయిన్ గా నెక్స్ట్ లీగ్ కు చేరినట్టే. ఇదిలా ఉంటే రీసెంట్ గా రష్మిక దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కే సినిమాకు నో చెప్పిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.
ఎలా వచ్చిందో.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ఒక్క ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనసేనాని జనసైనికులకు షాక్ ఇచ్చింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేనాని పవన్ కళ్యాణ్ అధికార టీడీపీ తో అంటకాగి ప్రతిపక్షంలో ఉన్న జగన్ పై చేసిన ఆరోపణలు విమర్శలు అన్నీ ఇన్నీకావు.. కానీ చివరకు ప్రజాక్షేత్రంలోనే పవన్ కు ప్రజలు బుద్ది చెప్పారని వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అయితే సీఎంగా జగన్ గద్దెనెక్కాక...
హైకోర్టు తీర్పు అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి స్పందించారు. యాజమాన్యమైనా, ప్రభుత్వమైన చర్చలకు ఆహ్వానిస్తే వెళ్తామని తెలిపారు. హైకోర్టు కూడా అదే తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. 3 రోజుల క్రితం తమతో చర్చలు జరపాలని.. కోర్టు సూచించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తోందని అశ్వత్థామ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికి సమ్మె 14 రోజులైనా ప్రభుత్వం స్పందిచట్లేదన్నారు. తాము చర్చలకు సిద్ధమేనని .. తమ...

ఎక్కువ మంది చదివినవి

బ్రేకింగ్ : 5000 కాదు 8000 ఇస్తున్న జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ల ప్రక్రియ చాలా...