Breaking News :

ఆపరేషన్ చిరుత: ఎక్కడున్నావమ్మా?

హైదరాబాద్‌ శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఓ చిరుత కలకలం సృష్టించింది. గురువారం తెల్లవారుజామున మైలార్‌దేవుపల్లి గగన్‌పహాడ్‌ రైల్వేగేటు సమీపంలోని అండర్‌ పాస్‌వే సమీపంలో హల్‌చల్‌ చేసింది.

నిన్నటి నుండి కొనసాగుతున్న చిరుత ఆపరేషన్..రంగం లోకి దిగిన మూడు అటవీశాఖ బృందాలు, జూపార్కు టీమ్స్.. ఫామ్ హౌస్ వైపు ఉన్న చెట్ల ల్లో నక్కి ఉంటుందని అనుమానం..రెండు బోన్ లు , డ్రోన్ కెమెరాల తో జెల్లడ పడుతున్న అధికారులు.

25 సీసీ ట్రాప్ కెమెరాల తో నిఘా పెట్టిన అధికారులు..రాత్రి మొత్తం కెమెరాల తో నిఘా లో ఉంచిన టీమ్స్..కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించున్న టీమ్స్..కల్వకుర్తి ప్రాంతంలో తప్పించుకున్న చిరుత ఇదేనా అన్నకోణంలో విచారణ..మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానున్న చిరుత ఆపరేషన్

అసలు ఏం జరిగింది

రైల్వేగేటు దగ్గర్లోని ప్రధాన రహదారి మధ్యలో డివైడర్‌ పక్కన.. గాయాలపాలై, నడిచే ఓపికలేని స్థితిలో ఓ చిరుత ఉండటాన్ని వాహనదారులు గుర్తించారు. ఉదయం 8.15 గంటలకు స్థానికులు డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారమిచ్చారు. మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ సత్తయ్యగౌడ్‌.. అటవీశాఖ, జూపార్క్‌ ఉన్నతాధికారులకు ఫోన్‌చేసి విషయం చెప్పారు. రోడ్డుపై ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. గంటన్నర తర్వాత చిరుతకు స్పృహ వచ్చింది. దీని సమీపంలో కాకినాడకు చెందిన ఓ లారీని పార్కింగ్‌ చేసి ఉంచారు. క్లీనర్‌ సుభాని సమీపంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అతని కాళ్లపై గాయపరిచి ఫాంహౌస్‌లోకి పరుగు తీసింది.

Read Previous

గ్రేట్..ఏపీ దిశ పోలీస్ స్టేషన్లకు అరుదైన గౌరవం

Read Next

కీచక డాక్టర్: కడుపు నొప్పితో వచ్చిన మహిళపై