అనౌన్స్: విజయ్ – పూరీల టైటిల్ విడుదల

విజయ్ దేవరకొండ హీరో గా, అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కి లైగర్ గా టైటిల్ ను అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాకి గతంలో ఫైటర్ అనుకోగా, తాజాగా చిత్త యూనిట్ చేసిన ప్రకటనతో పూరి జగన్నాథ్ విజయ్ సినిమా పై ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఈ చిత్రం టైటిల్ తో పాటుగా విజయ్ లుక్ ను కూడా రివీల్ చేశారు చిత్ర యూనిట్. మాస్ లుక్ తో బాక్సర్ గా కనిపిస్తున్నారు విజయ్ దేవరకొండ. అటు లయన్, ఇటు టైగర్ లకు క్రాస్ బ్రీడ్ గా లైగర్ అంటూ రిప్రజెంట్ చేశారు టీమ్.

Image

ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా వస్తుండటంతో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతేకాక టాలీవుడ్ లో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దేవరకొండ ఈ సినిమా కి మరొక అట్రాక్షన్.

Image

ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా టాలీవుడ్ లో పరిచయం కానున్నారు.

'स्टूडेंट ऑफ द ईयर 2' के लिए जिम में पसीना बहा रही अनन्या पांडे,  टाइगर श्रॉफ के साथ होगा डेब्यू | Bollywood Life हिंदी

ఈ సినిమా కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు.

Image