ప్ర‌కాశం జిల్లా క్రికెట్ స్కాంపై విజిలెన్స్ విచార‌ణ‌

20

ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్‌లో భారీ స్కాం జ‌రిగిన‌ట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప‌దిహేను ఏళ్లుగా కొంద‌రి చేతుల్లోనే ప్ర‌కాశం జిల్లా క్రికెట్ ఆసోసియేష‌న్ న‌లిగిపోతోంది. అధ్య‌క్షుడు, కార్య‌ద‌ర్శి క‌నుస‌న్న‌ల్లో కోట్లాది రూపాయ‌లు నిధుల గోల్ మాల్ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

విజిలెన్స్ విచార‌ణ జ‌రిపించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌కు త‌ల్లిదండ్రులు, ప్లేయ‌ర్లు ఫిర్యాదు చేశారు. ప్లేయ‌ర్స్ ను ఎంపిక కోసం పేరెంట్స్ నుంచి భారీగా డ‌బ్బులు వ‌సూళ్లు చేసిన‌ట్లు స‌మాచారం. లంచాలు తీసుకుని స్థానికేత‌రుల‌కు కూడా ఇందులో అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు ఆరోపిస్తున్నారు.

పాత‌క‌మిటీ మ‌ళ్లీ ఇప్పుడు కూడా ఎలాంటి అనుభ‌వం, క్రికెట్ నేప‌థ్యంలేని వారికి అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శి, ట్రెజ‌ర‌ర్ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌ని పేరెంట్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కొత్త ప్ర‌భుత్వం ఈ వ్య‌వ‌హారంపై విజిలెన్స్ విచార‌ణ చేయించాల‌ని ప‌ట్టుప‌డుతున్నారు.