ప్రజా సొమ్ము దుర్వినియోగం చేశారని చంద్రబాబు పై లోకాయుక్త లో కేసు
Timeline

ప్రజా సొమ్ము దుర్వినియోగం చేశారని చంద్రబాబు పై లోకాయుక్త లో కేసు

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నలభై ఏళ్ళ విసనరీ రాజకీయ వేత్త, దేశ రాజకీయాలను చక్రం తిప్పిన లీడర్ చంద్రబాబు నాయుడు గారి పై లోకాయుక్తలో కేసు నమోదు అయింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసారని ఏవి రమణ ( జనతాదళ్ – ఏపీ జనరల్ సెక్రెటరీ ) లోకాయుక్త లో ఫిర్యాదు చేసారు.

ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం ఢిల్లీలో ధర్నా చేస్తాం అని అయన కేబినెట్ అంతా ఢిల్లీకి తీసుకెళ్లి ప్రజల సొమ్ము వృధా చేసారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదును ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త ఆగస్టు 7 న స్వీకరించింది. తన రాజకీయ లబ్దికోసం ప్రజా సొమ్ము దుర్వినియోగం అనేది నేరం. చంద్రబాబు ఒక్క రోజు ధర్నాకి 12 కోట్ల వరకు ఖర్చు చేసారని అందులో తెలిపారు.

ఫిర్యదు లెటర్లో , ఈ ధర్నా కోసం ఖర్చు చేసేందుకు నిధులను వివిధ రకాల ప్రభుత్వ ఆర్దర్లతో దోచుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అప్పుడు కేవలం 2 కోట్లు మాత్రం ఖర్చు చేశామని చెప్పిందని, ఆ నిధులన్నీ కేవలం ఏపీ నుండి ఢిల్లీ కి రైళ్లు వేసినందుకు, అక్కడ టెంట్లు వేసినందుకు వినియోగించమని చెప్పిందని పేర్కొన్నారు.

అక్టోబర్ ఒకటో తేదీన ఈ కేసు తదుపరి విచారణ జరుగుతుందని కూడా లోకాయుక్త వెల్లడించింది.

చిత్రం – భళారే విచిత్రం

ఇంత పెద్ద కేసు చంద్రబబు పై అది కూడా లోకాయుక్తాలో నమోదు అయితే ఒక్క తెలుగు మీడియా ఛానల్ లో కూడా కనీసం స్క్రోలింగ్ కూడా ఇవ్వడకపోవడం ఆశ్చర్యంగా ఉన్నా పెద్ద ఆశ్చర్యం ఏమి కాదు అనుకోండి – మీడియా సమస్థలకు బాబు గారికి ఉన్న బంధం అటువంటింది.

Leave a Reply

Your email address will not be published.