ట్రెండ్ అవుతున్న ’50 రూపాయలు’

కరోనా పేరు చెప్పి ప్రభుత్వాలు సామాన్య ప్రజల పై నిత్యావసరాల ధరలు పెంచుతూ కక్ష తీర్చుకుంటున్నాయి. రోజురోజుకీ పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం పెట్రోలు ధర సెంచరీ కొట్టేసింది. ఇక ఎల్పీజీగ్యాస్ ధరపై ఈ రోజు 50 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో దాదాపుగా గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల రూపాయల వరకు ఉండబోతుంది.

అంతేకాదు ఇన్ని రోజులు ఇచ్చిన సబ్సిడీ కూడా ప్రభుత్వం తీసివేసింది. ఈరోజు 50 రూపాయలు పెంచడంతో ప్రజలు తలలు బాదుకుంటున్నారు. సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే Rs.50 ట్రెండ్ అవుతుంది ట్విట్టర్ లో.