మహబూబాబాద్ జిల్లాలో బెట్టింగ్ ముఠా అరెస్ట్
Timeline

మహబూబాబాద్ జిల్లాలో బెట్టింగ్ ముఠా అరెస్ట్

ఐపీఎల్ మ్యాచ్‌ల నేప‌థ్యంలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా కొన‌సాగుతోంది. దీనితో తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యి, రాష్ట్రమంతా జల్లెడ పట్టి మరీ బెట్టింగ్ ముఠాల అంతు తెలుస్తున్నారు. మొన్న హైదరాబాద్ లో ఒక పెద్ద ముఠాని పట్టుకున్నారు మన హైదరాబాద్ పోలీసులు. అయితే ఈ బెట్టింగ్ దందా ఒక్క హైదరాబాద్ లాంటి సిటీలోనే కాదు జిల్లాలోకి కూడా పాకింది.

ఇన్ఫార్మర్ల దగ్గర నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఎక్కడికక్కడ తనికీలు చేయడం మొదలుపెట్టారు. ఇలాగే మహబూబాబాద్ లో కూడా బెట్టింగ్ దందా చెలరేగుతున్నటు సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు ఒక ముఠా గుట్టు రట్టు చేసారు

గత కొన్ని రోజుల నుండి బెట్టింగ్ కు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి 12 మంది సభ్యుల ముఠా ను అరెస్ట్ చేసారు.
వారి వద్ద నుండి లక్ష రూపాయల నగదు 11 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పి నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.