మహేష్ చిన్ననాటి ఫోటో వైరల్

8

“సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు సంబందించిన ఏ పిక్ వచ్చిన..ఏ విషయం వచ్చిన దానిని క్షణాల్లో వైరల్ చేస్తుంటారు. తాజాగా మహేష్ కు సంబందించిన చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మహేష్ కు ఐదేళ్ల వయసులో దిగిన ఫోటో ఒకటి బయటకొచ్చింది.

ఈ ఫోటో లో మహేష్ డెనిమ్ జాకెట్ ధరింది కెమెరా వైపు క్యూట్ గా చూస్తున్న కనిపించాడు. ఈ ఫోటో ను చూసిన అభిమానులు , నెటిజన్లు ఈ పిక్ కు విపరీతంగా లైక్స్ కొడుతూ , తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.