హీరో సూర్య నిర్మాతగా సుధా కొంగర దర్శకత్వంలో మహేష్ బాబు
Timeline

హీరో సూర్య నిర్మాతగా సుధా కొంగర దర్శకత్వంలో మహేష్ బాబు

చాలా మందికి తెలియదు కానీ సుధా కొంగర మొదటి చిత్రం 2008 లో కృష్ణ భగవాన్ హీరోగా నటించిన ఆంధ్రా అందగాడు. ఆ సినిమాతోనే తాను దర్శకురాలిగా మారింది. అయితే ఆ సినిమా పేరు తన వికీపీడియా ఫిల్మోగ్రఫీ లిస్టులో కూడా మీకు దొరకదు. ఆ సినిమా డైరెక్టర్ పేరు సుధ కె ప్రసాద్ అని గూగుల్ లో వస్తుంది. ఆ పేరు మీద క్లిక్ చేస్తే మాత్రం మీరు సుధా కొంగర వికీ పీడియా పేజుకే వెళ్తారు. అలాంటి సినిమా చేసిన సుధా ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తుందా అనే ఆశ్చర్యం రాక తప్పదు. ఆ సినిమా ఇచ్చిన ప్రతిఫలమే తన విజయానికి బాట వేసింది. మొన్న ఓటిటి లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఆకాశం నీ హద్దురా ఆస్కార్ రేసులో ఉంది. సూర్య కెరీర్ లోనే ఇది బెస్ట్ సినిమా అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా చూసిన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. సుధా దర్శకత్వం చాలా బాగుందని మెచ్చుకున్నారు కూడా.

ఇపుడు సుధా దర్శకత్వంలో మహేష్ బాబు 28 వ తదుపరి చిత్రం రాబోతుందని సమాచారం. #SSMB28 సినిమాను AK ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించనున్నారని వినికిడి. ఈ చిత్రం అటు తమిళం మరియు తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో రిలీజ్ అవుతుందని, ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. తమిళంలో ఈ సినిమాను సూర్య సొంతంగా నిర్మించాలనుకుంటున్నట్టు, అసలు సుధా తో మహేష్ సినిమా సెట్ చేసింది కూడా సూర్యానే అని సమాచారం. ఇక హిందీలో ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరానీ బ్యాంక్ రోల్ చేయనున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.