పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాను ప్రకటించి చాలా రోజులు దాటుతుంది. కరోనా తరువాత అన్ని సినిమాలు పరుగులు పెడుతుంటే మహేష్ మాత్రం ఆలస్యంగానే వచ్చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. అయితే ఆ మధ్యే సర్కార్ వారి పాట సినిమాలోని మహేష్ లుక్ ను విడుదల చేశారు. కాగా, ఇప్పుడు ఆ పోస్టర్ ముచ్చట మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ప్రీ లుక్ రివీల్ చేస్తూ కొరటాల పోస్టర్ విడుదల చేశాడు. కాగా కొరటాల షేర్ చేసిన పోస్టర్, సర్కార్ వారి పాట సినిమాలోని మహేష్ లుక్ పోస్టర్ ఒకేలా ఉండడంతో వలె ఇరువురి ఫ్యాన్స్ రెండింటి మధ్య పోలికలను చూపెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి హీరోల పోస్టర్లను షేర్ చేస్తూ వైరల్ గా మార్చేశారు మహేష్ ఫ్యాన్స్.
