మహేష్ బాబు ముఖ్య అతిధిగా దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019
Timeline

మహేష్ బాబు ముఖ్య అతిధిగా దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019

భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019 వేడుకకు సమయం దగ్గర పడింది. దాదాసాహెబ్ 150వ జయంతిని పురస్కరించుకొని ఈ అవార్డ్స్ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖుల్ని సత్కరించనున్నారు.

ఈ వేడుకకు హైదరాబాద్‌లోని మాదాపూర్, ఎన్ కన్వెన్షన్ వేదిక కానుంది. మరో పదిరోజుల్లో సెప్టెంబర్ అంటే 20వ తేదీన ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. భారతీయ సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడంలో సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ కృషి ఎంతయినా ఉంది. ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎన్నో ఏళ్లుగా ఎంతో కృషి చేస్తున్నారు. వారిని గౌరవించేందుకు దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరు అవుతారని అందుకు తగిన ప్లాన్స్ కూడా చేసారు కానీ ఆయన స్థానంలో కొత్త గవర్నర్ రావడంతో ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ఈ కార్యక్రమానికి దాదాసాహెబ్ ఫాల్కే మనవడు సి ఎస్ పుసాల్కర్ ముఖ్య అతిధిగా హాజరౌతున్నారు. అంతే కాదు ఇక ఈ ఈవెంట్ కి తెలుగు సూపర్ స్టార్ మహేష్‌ బాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని సమాచారం.

ఈ ఈవెంట్ ని లైవ్ లో చూడాలనుకునేవారికి టికెట్స్ ని ఆన్లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published.