Breaking News :

నిర్భయ కేసు: న్యాయం జ‌రిగింది: మహేష్ బాబు

2012లో నిర్భయ హత్యాచార కేసులో నలుగురు దోషులైన ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను శుక్ర‌వారం ఉరి తీశారు. ఎనిమిదేళ్ల పోరాటం తర్వాత నిందితులను ఉరి తీశారు. దీనిపై మహేష్ బాబు స్పందిస్తూ ట్వీట్ చేశారు.

చాలా కాలం వెయిట్ చేశాం. న్యాయం జ‌రిగింది. నిర్భ‌య ఘ‌ట‌న‌పై ఇప్పుడు జ‌రిగిన విష‌యం న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కాన్ని మ‌రింత పెంచింది. న‌మ్మ‌కంతో పోరాటం చేసిన నిర్భ‌య త‌ల్లిదండ్రుల‌కు, న్యాయ‌వాదుల‌కు సెల్యూట్‌. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై గౌర‌వం పెరిగిందంటూ మహేష్ ట్వీట్ చేశారు.

Read Previous

ఇంట్లోనే ఉండండి: విరుష్క

Read Next

జియో బంపర్ ఆఫర్: యూజర్లకు డబుల్ డేటా