Breaking News :

RSS కి వ్యతిరేకంగా ప్రసారాలు చేశాయని మలయాళం న్యూస్ ఛానళ్లపై నిషేధం విధించిన ప్రభుత్వం

ఢిల్లీ అల్లర్ల కవరేజ్’ పై మలయాళ ఛానల్స్ ఆసియానెట్ న్యూస్ మరియు మీడియా వన్ చానళ్ల ను సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 48 గంటలు నిషేధించింది. మార్చి 6, శుక్రవారం రాత్రి 7.30 నుండి రెండు ఛానెల్‌లు బ్లాక్ స్క్రీన్‌ను చూపిస్తున్నాయి. మార్చి 8 న రాత్రి 7.30 గంటలకు మాత్రమే ఛానెల్‌లు ప్రసారం అవుతాయి. ఏషియానెట్ న్యూస్ మరియు మీడియా ఒన్ ఛానళ్ల ప్రసారాలు ప్రజలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని అంతేకాకుండా పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ఇచ్చిన వారిని తక్కువ చేసి చూపించాయని మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వు ఆరోపించింది. అంతే కాకుండా మీడియా వన్ ఛానల్ ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శిస్తుందని తెలిపారు.

Read Previous

సిద్ శ్రీరామ్ మరో సంచలనమేనా..!

Read Next

వీడియో: ఆడబిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడి భార్య