వామ్మో… చంపి ఆత్మహత్యగా మార్చాడు
Timeline

వామ్మో… చంపి ఆత్మహత్యగా మార్చాడు

రాజస్థాన్‌లోని కోట జిల్లాలో32 ఏళ్ళ వ్యక్తి తన భార్యను ఫ్యాన్ కు ఉరి వేసి చంపి , ఆ హత్యను ఆత్మహత్యగా మలిచాడు.

ముకేశ్ అర్వాల్ ను సోమవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసారు. ముకేశ్ తన భార్యతో అనుబంధం సరిగా లేనందున భార్య ను చంపాలని నిర్ణయించుకున్నాడు.

ముకేశ్ ఇంటికి వెళ్లిన పోలీసులకు , ముకేశ్ భార్య బంధువులకు కలిగిన అనుమానాల కారణంగా ముకేశ్ ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేయగా, తన భార్యను తానే చంపినట్టు ద్రువీకరించాడని పోలీసులు తెలిపారు.

ముకేశ్ భార్య బంధువులు ఆరోపించినట్టుగా ముకేశే భార్యను చంపి ఉంటాడన్నది నిజమైంది .