spot_imgspot_img

#MeToo : మణిరత్నం ముందుక్కో.. వెనకక్కో.. అస్సలేందుక్కో.. ఏమిటో!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీటూ వ్యవహారంలో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం చిక్కుకున్నారు. తమిళ దర్శకుడు మణిరత్నం.. తన కొత్త సినిమా విషయంలో తీసుకున్న ఓ నిర్ణయంతో మీటూ ఉద్యమకారులు, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా మణిరత్నంపై విరుచుకుపడుతున్నారు.

అయితే మణిరత్నం ఓ మహిళను వేధించి మీటూ ఇబ్బందిలో చిక్కుకోలేదు. మణిరత్నం తన కొత్త సినిమా ‘పొన్నియన్ సెల్వన్’‌కు తమిళ రచయిత వైరముత్తును ఎంచుకున్నాడట. అంతేకాదు ఆ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా చేత 12 పాటలు రాయించారట. దీంతో మీటూ ఉద్యమకారులు, నెటిజన్లు మణిరత్నాన్ని ఏకిపారేస్తున్నారు. తెలిసి తెలిసి ఎలా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రచయితకు అవకాశం ఇస్తారంటూ ఫైర్ అవుతున్నారు.

ఇంకా వైరముత్తును ఆ సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మణిరత్నంను మాత్రమే కాకుండా ఆస్కార్ అవార్డు గ్రహీత, ఏఆర్ రెహమాన్‌ను కూడా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. దింతో మణిరత్నం వెనక్కి తగ్గే అవకాశం కూడా ఉండచ్చు అనేది సినీ వర్గాల సమాచారం.

Related Articles

Get in Touch

18,128FansLike
3,029FollowersFollow
0SubscribersSubscribe

Latest Posts