హత్రాస్ గ్యాంగ్‌రేప్: మనీషాను బలవంతంగా దహనం చేసిన పోలీసులు, ఆమె కుటుంబాన్ని గదిలో పెట్టి తాళం వేసి
Timeline

హత్రాస్ గ్యాంగ్‌రేప్: మనీషాను బలవంతంగా దహనం చేసిన పోలీసులు, ఆమె కుటుంబాన్ని గదిలో పెట్టి తాళం వేసి

తాజాగా ఉత్తరప్రదేశ్ లో నలుగురు కామంధులు 19 ఏళ్ల మనీషా వాల్మీకి అనే అమ్మాయిని చిత్రహింసలు పెట్టి సాముహిక అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన రెండు వారల కింద జరిగి చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ కి చెందిన మనీషా వాల్మీకి తన తల్లితో కలిసి పొలాలకు వెళ్లింది.. అక్కడ నలుగురు యువకులు ఆమెను లాకేళ్లి, తీవ్రంగా హింసించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఎక్కడ తమ పేరు చెపుతుందో అని భయపడి ఆమె నాలుకను కూడా కోశారు. వెన్నుమక పైన దాడి చేశారు. కొద్దిసేపటి తర్వాత యువతి తల్లి తన కూతురు కోసం వెతకగా తీవ్రంగా గాయాలపాలై, నగ్నంగా, రక్తస్రావమై కనిపించింది.

దీనితో మనీషాను ఢిల్లీలో అలీఘర్ ఆసుపత్రికి తరలించారు.. వెంటిలేటర్ పైన గత కొద్దిరోజులుగా ప్రాణాలతో పోరాడుతూ మనీషా మంగళవారం మృతి చెందింది.

ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. రేపిస్టులను బహిరంగంగా కాల్చి చంపాలని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. దాడి చేసిన నలుగురు, మహిళ గ్రామానికి చెందిన ఉన్నత కులానికి చెందినవారు.. అటు అత్యాచారం కేసుల జాబితాలో యూపీ సంఖ్య వేగంగా పెరుగుతుంది. అక్కడ ప్రతి రెండు గంటలకు ఒక్క అత్యాచార కేసు నమోదు అవుతుంది.

అయితే రాత్రికి రాత్రి , మనిషా కుటుంబం నిరాకరించినా వినకుండా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అమీ మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా బలవంతంగా దహనం చేసేసారు. తమ తండ్రి , అమ్మాయి అన్నయ్యలు లేరు వచ్చే వరకు ఆగండి అని చెప్పినా వినకుండా పోలీసులు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి 3 గంటలకు దహనం చెయ్యాల్సిన అవసరం పోలీసులకు ఏంటి అని కుటుంబం ప్రశ్నిస్తుంది.

అమ్మాయి మృతదేహాన్ని కుటుంబానికి ఇవ్వకుండా , వారిని తమ ఊరికి వెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చారని, మృతదేహం ఎక్కడుందో కూడా పోలీసులు చెప్పట్లేదని వారు తెలిపారు.