భారతీయ అమ్మాయితో మ్యాక్స్ వెల్ లవ్ రొమాన్స్

ఆస్ట్రేలియా జట్టు ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ భారతీయ అమ్మాయితో లవ్ రొమాన్స్ సాగిస్తున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఆన్ లైన్ లో దర్శనమిస్తున్నాయి. భారత సంతతికి చెందిన వినీ రామన్ ఫ్యామిలీ ఆస్టేలియాలోనే స్థిరపడ్డారు. గత కొద్దీ నెలలుగా మ్యాక్స్ వెల్ వినీ రామన్ చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఈ విషయం అక్కడి మీడియాలో హల్ చల్ అవుతుంది.

ఒక్క మ్యాక్స్ వెల్ మాత్రమే కాదు గతంలో మాజీ పేస్ బౌలర్ షాన్ టైట్ కూడా భారత అమ్మాయినే పెళ్లాడాడు. 2014 ఐపీఎల్ లో ఓ వేడుకలో మషూమ్ సింఘాతో షాన్ టైట్ కు పరిచయం అయింది. ఆ తర్వాత అది ప్రేమగా మారటంతో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇప్పుడు మ్యాక్స్ వెల్-వినీరామన్ ఒక్కటైతే భారత యువతిని పెళ్లాడిన రెండో ఆసీస్ క్రికెటర్గా మ్యాక్స్ వెల్ రికార్డులకెక్కుతాడు.