థాంక్యూ జగన్: మెగాస్టార్ చిరంజీవి
Timeline

థాంక్యూ జగన్: మెగాస్టార్ చిరంజీవి

కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు లో ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఈ లాక్ డౌన్ అమలు కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమ కి మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగల్ విండో అనుమతులు జీవో విడుదల చేసినందుకు సినీ పరిశ్రమ తరపున వారికి కృతజ్ఞతలు ఫోన్ ద్వారా తెలియ జేసాను అని మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే లాక్ డౌన్ ముగిసిన అనంతరం సినీ పరిశ్రమ సమస్యల పై చర్చించేందుకు కలుద్దామని చెప్పారు అని చిరు వివరించారు.

అయితే ఈ విషయం పై మెగాస్టార్ చిరంజీవి పలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ లో అన్ని విభాగాల నుండి ప్రతి నిధులతో త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అయితే చిరు చేసిన ఈ వ్యాఖ్యల పై నెటిజన్లు స్పందిస్తున్నారు. చిరు పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ లో షూటింగ్ లు మళ్లీ పునరుద్దరణ కి చిరు కృషి చేస్తున్నారు అని, అవి ఫలించాయి అని వ్యాఖ్యానించారు. అయితే కొందరు మాత్రం చిరు చేసిన వ్యాఖ్యలకు రాజకీయ కోణం లో పవన్ పై విమర్శలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.