ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల: హరీష్ రావు

సంగారెడ్డి జిల్లాలలోని కంది గ్రామంలో రైతు వేదికను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటుపై తీవ్రంగా స్పందించారు.

ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతోందని మాట్లాడుతున్నారు.. తెలంగాణ గురించి వారికి కొంచెమైనా తెలుసా? అని ప్రశ్నించారు.

రాజన్న రాజ్యం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటోందని, ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల ? ఏపీలో అలా జరుగుతోందా? అని ప్రశ్నించారు.

ఏపీలో రైతులకు ఎంత భూమి ఉన్నా కేవలం రూ. 12,500 మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్న మంత్రి హరీష్ రావు.. తెలంగాణ ఎకరానికి పదివేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు బంధు అందజేస్తున్నామని చెప్పారు.