రాజధాని మార్పు ఉండదు: మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
Timeline

రాజధాని మార్పు ఉండదు: మంత్రి మేకపాటి గౌతంరెడ్డి

అమరావతే రాజధానిగా ఉంటుందని ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లను బుధవారం సన్మానించారు.

ఈసందర్భంగా మంత్రి గౌతంరెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు సమానంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అంతే తప్ప రాజధానిని మార్చాలన్న ఆలోచన ఏమీ లేదన్నారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. ఆర్థిక మాంద్యం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తుందని, భవిష్యత్తులో నైపుణ్యం ఉన్న సిబ్బందిని తయారు చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.