మంచిని గుర్తించాడట.. జనసేన ఎమ్మెల్యే

12

ఎలా వచ్చిందో.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ఒక్క ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనసేనాని జనసైనికులకు షాక్ ఇచ్చింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేనాని పవన్ కళ్యాణ్ అధికార టీడీపీ తో అంటకాగి ప్రతిపక్షంలో ఉన్న జగన్ పై చేసిన ఆరోపణలు విమర్శలు అన్నీ ఇన్నీకావు.. కానీ చివరకు ప్రజాక్షేత్రంలోనే పవన్ కు ప్రజలు బుద్ది చెప్పారని వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

అయితే సీఎంగా జగన్ గద్దెనెక్కాక కూడా వదలకుండా పవన్ అదే రీతిలో విమర్శలు చేస్తున్నాడు. మూడు నెలలు కూడా నిండకముందే చంద్రబాబుతో కలిసి విమర్శలు చేస్తూ ఇరుకున పెడుతున్నాడు..జగన్ ను బద్ధ శత్రువుగా చూస్తున్నారు.

పవన్ ఎన్నికల్లో గెలవకపోయినా ఆయన పార్టీ నుంచి గెలిచాడు రాపాక వరప్రసాద్. గోదావరి జిల్లాలోని రాపాక నియోజవర్గం నుంచి జనసేన తరుఫున ఏపీలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వరప్రసాద్ తన పార్టీ అధినేత జనసేనానికి షాక్ ఇచ్చారు. ఎప్పుడో జగన్ కు మద్దతు ప్రకటించారు.

అయితే తాజాగా ఆటో డ్రైవర్లపై జగన్ వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆటోడ్రైవర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ జగన్ చిత్రపటంపై క్షీరాభిషేకం చేయడం విశేషం.

ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జగన్ అంటేనే తిట్టే జనసేనాని పవన్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఇలా జగన్ పై పాలుపోయడం పెద్ద ఎదురుదెబ్బగా మారింది. జనసేనాని పవన్ 24 గంటలూ జగన్ ను వ్యతిరేకిస్తుంటే ఆ పార్టీ ఎమ్మెల్యే మాత్రం జగన్ మంచి పనులకు ఫిదా అయిపోయి బహిరంగంగా క్షీరాభిషేకం చేసిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని బేస్ చేసుకొని పవన్ పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు వైసీపీ అభిమానులు. మీరు ఎలాగూ మంచిని గుర్తించలేరని.. కనీసం మీ ఎమ్మెల్యే అయినా గుర్తించాడని సైటైర్లు వేస్తూ మీమ్స్ తయారుచేస్తూ పవన్ పై ఆడిపోసుకుంటున్నారు.